"ఇది కలయా వైష్ణవ మాయా?" నమ్మశక్యం కాక మా ఆవిడని అడిగాను నేను - బషీర్ బాగ్ నుండి లక్‌డీ కా పూల్ అయిదు నిమిషాలలో వచ్చేసరికి.
"ఈ రోజు ఏమన్న శెలవేమో" చెప్పింది స్వాతి.
రేడియో లో మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి మృదు మధుర గాత్రం మనసును రంజింపజేసింది.
"పలుకే బంగారమాయెరా
కోదండ స్వామి పలుకే బంగారమాయెరా
పలుకే బంగారమాయే
పిలిచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ జక్కని స్వామి..."
"శ్రీ రామ నవమి!" నాకు సిగ్గేసింది. ఈ డైనందిక జీవితపు నిర్విరామపు హోరు లో పడి మన పండుగలు కూడా గుర్తు లేని స్థితికి చేరుకున్నాము.
చిన్నప్పుడు బసవన్న గారు ఇంటి ముందుకి వచ్చి సన్నాయి మేళం తో సరదాగా సంక్రాంతి ని గుర్తు తెచ్చే వారు... భోగి పండగ అంటే రాత్రి అంతా నిద్ర పోకుండా ఇంటి పెరట్లో ఉన్న చెత్త అంతా ఏరి తెలవారేలోపాల తగల బెట్టి - ఆ మంటలు పైన ఉన్న కరెంట్ తీగలకు తాకుతుందేమో నని - నాన్న తిడతారేమోనని భయపడి ...
పానకం తాగి వడపప్పు తిని - రాముడికి దండం పెట్టేసి - అందరి ఇళ్ళకి వెళ్ళి - ప్రతి చోట మళ్లీ పానకం తాగి - ఆ రోజులు మళ్లీ వస్తాయా?
"ఏ తీరుగనను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామా...
నా తరమా భవ సాగరమీదను..."
బాల మురళీకృష్ణ - మీకు సాటి ఎవ్వరూ లేరండి.
అయ్యో చెప్పడం మర్చిపోయాను - శ్రీ రామ నవమి శుభాకాంక్షలు - ఇది చదివిన వారందరికి
వేణు

No comments:
Post a Comment